త్రైమాసిక మెట్లోత్సవం – Metlotsavam from Nov 5 to Nov 7th

టిటిడి నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనుంది.

మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది.

తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి మూడో సత్ర ప్రాంగణంలో ప్ర‌తిరోజూ ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు చేపడతారు.

ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల భజన మండళ్ల‌తో సంకీర్తనలు నేర్పిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, హరిదాసులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

న‌వంబ‌రు 5న శోభాయాత్ర‌

నవంబరు 5న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశమిస్తారు. నవంబరు 7వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

TTD is grearing up to held quarterly Metlotsavam from November 5th to 7th. The Dasa Sahitya project is conducting MetLotsava program. In third Satram of TTD behind the railway station in Tirupati, Dasasahithya Project offers daily meditation and mass bhajans with bhajan mandals every day from 5 am to 7 pm.

They will start programmes from 8.30 am to 12 noon, Bhajan Mandals of Andhra Pradesh, Tamil Nadu and Karnataka will be attend this programme. From 3 pm to 6 pm, the religious messages and the teachings of the pilgrims will be conveyed. There will be music and cultural programs from 6 to 8 pm.

Shobayathra on November 5th
   
The Dasasahithya project will conduct Shobhayathra on november 5th from 4 pm, from Govindaraja Swamy Temple to TTD third Satrams. Official celebrities will speak from 6 to 8 p.m. on the same day. On 7th of November, they will hled Metlotsavam from Alipiri Padala mandapam. Thousands of Bhajan Mandal members perform traditional bhajans and reach the Tirumala.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*