తిరుమలలో పుష్పయాగం On 4th Nov Pushpayagam in Tirumala

కొన్ని సేవలు రద్దు Some sevas cancelled accordingly

కార్తీకమాసంలో శ్రవణానక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 4వ తేదీ సోమ‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరుగనుంది.

నవంబరు 3న  పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణం కారణంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.  

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కారణంగా ఆర్జితసేవలైన విశేష పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

Pushpayagam in Tirumala on November 4th

Tirumala Tirupati Devasthanam is going to conduct Pushpa Yagam on Monday, November 4th in Tirumala Sri Vari Temple. TTD officials are gearing up Ankurarpana on 3rd, November for Pushpa Yagam. on this occassion, TTD cancelled Vasanthotsavam, Sahasradeepalankarana sevas on Monday.

On second of Pushpayagam TTD will perform Snapanathirumanjanam at Kalyanamadapam in Tirumala Temple to Lord Malappa swamy and Sri Devi. It is specially anointed with milk, yoghurt, honey, sandalwood, turmeric etc. The celebration will be held from 1 pm to 5 pm with a variety of flowers and papers.

Sri Malayappa Swami and Sridevi will give blessings to devotees in four Mada streets of Tirumala. On the ocassion of Pusphayagam, TTD has canceled the special Pooja, Kalyanotsavam, Jhanjalseva, Brahmotsavam and Vasanthvasava.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*