ఆల‌యాల పోస్టర్ల ఆవిష్క‌ర‌ణ‌ TTD TEMPLES POSTERS RELEASED

టిటిడికి అనుబంధం ఆలయాలైన నారాయణవనంలో వార్షిక తెప్పోత్సవాలు, నగరిలో పవిత్రోత్సవం, స‌త్ర‌వాడ‌లో పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను శుక్ర‌వారం తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

న‌వంబ‌రు 8 నుండి 12వ తేదీ వరకు నారాయణవనం వార్షిక తెప్పోత్సవాలు

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక తెప్పోత్సవాలు న‌వంబ‌రు 8 నుండి 12వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

మొదటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారు, రెండో రోజు శ్రీ అండాళ్ అమ్మవారు, చివరి మూడు రోజులు శ్రీ దేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై విహరిస్తారు. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

నవంబరు 12న నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం

నగరిలో గల శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయంలో నవంబరు 12వ తేదీన పవిత్రోత్సవం జరుగనుంది. ఇందుకోసం నవంబరు 11న‌ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.
పవిత్రోత్సవంలో భాగంగా నవంబరు 12న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ‌స్తులు రూ.300/- చెల్లించి ప‌విత్రోత్స‌వంలో పాల్గొన‌వ‌చ్చు. వీరికి ఒక ప‌విత్ర‌మాల‌, ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అన్న‌ప్ర‌సాదాలు బ‌హుమానంగా అంద‌జేస్తారు.

నవంబరు 12న స‌త్ర‌వాడ‌లోని శ్రీ కరివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం

స‌త్ర‌వాడ‌లోని శ్రీ కరివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆలయంలో నవంబరు 12న పవిత్రోత్సవం జరుగనుంది. ఇందుకోసం నవంబరు 11న‌ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.పవిత్రోత్సవంలో భాగంగా నవంబరు 12న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ‌స్తులు రూ.300/- చెల్లించి ప‌విత్రోత్స‌వంలో పాల్గొన‌వ‌చ్చు. వీరికి ఒక ప‌విత్ర‌మాల‌, ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అన్న‌ప్ర‌సాదాలు బ‌హుమానంగా అంద‌జేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

TTD Local temples Utsavams posters released

Tirumala Tirupati Devastanam Excutive Officer Basantha Kumar released Utsavams posters of Local temples on Friday in TTD JEO office.

TTD planned to conduct Theppotsvams of Sri Kalyana Venkateswara swami in Narayanavanam and Pavithrotsavam of Sri Karimanikyaswami in Nagiri, and posters of Sri Kari Varadarajaswami posters. Kalyana Venkateswara swami annual Theppotsavams from November 8 to 12. Daily Evening 5.30 PM to 8 PM will be performed. Devotees will have Dharshan on this time. TTD will conduct Tiruamanjanam from 9 AM to 10 AM.

On first day, Sri Seetha, Lakshmana Ramachandraswamy will ride procession on floats in Narayanavanam. Last three days, Sri Devi Bhudevi, Kalyani Venkateswara swamy will ride procession on float in Nagari. Hindu Dharma Prachara Parishad will conduct cultural programmes in this occassion.

Pavithrotsavams in Nagari and Sathravada on 12 th November
TTD will conduct Pavithrotsavam in Sri Kariyamanikyaswami of Nagari and Sri KariVaradarajaswami temples of Sathravada on 12th of November 2019. they will perform Ankurarpana on 11th of November 2019 in both temples. Gruhasthas wants to pay Rs. 300/- to participate in Pavithrotsavams. TTD will give Pavithramala, one Uttarium, one Jocket, Anna Prasadams.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*