కపిలతీర్థంలో హోమం Homam in Kapilatheertham

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.

      ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

       
కాగా శ‌నివారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా శ‌నివారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

      గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. 

    ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Homam in Kapilatheertham

Tirumala Tirupati Devasthanam conducted ‘Homa Pooja’ in Kapileswara swamy Temple in Kapilatheertham on Friday morning from 9 AM to 12 noon for Lord Subramanyam Swamy and gave Harathi. From morning to 12 noon priests did poojs, Laghupoornahuthi, Nivedana and finally they gave Harathi to Swamy. They are going conduct Homam and Sahasranamarchana, Visesha Deeparaadhana on evening 6 PM. TTD called devotees to partcipated in Sri Valli devsena sametha Subramanyaswami Kalyanam on Saturday evening. Who wants participated in this programme have to pay Rs. 250/- for Gruhasthas(two members). TTD will give Prasadams to them who parcitipated in Kalyanothsavam.

And also TTD annouced that, Gruhasthas can partcipate in Homam also. But, they have to pay Rs. 500/- per day. They will get one Uttariyam(Cloth), one Ravika(jocket) and Prasadams.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*