అవినీతి రహిత టిటిడి – స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ‌ Corruption free TTD- Pledge by Employees

తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం సంస్థ ఉద్యోగులకు అవ‌గాహ‌న వారోత్స‌వాలను నిర్వమించింది. వారోత్సవాలలో భాగంగా శుక్ర‌వారం టిటిడి ఉద్యోగులు స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ చేశారు.
        కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్ యాక్ట్ – 2003పై అవగాహన కల్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా అక్టోబ‌రు 29 నుండి న‌వంబ‌రు 3వ తేదీ వ‌ర‌కు టిటిడిలో విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వం నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. నాలుగవ రోజున శుక్ర‌వారం ఉద‌యం 10.15 గంట‌ల‌కు తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాన భ‌వ‌నం, టిటిడి విద్యాసంస్థ‌లు, వైద్య‌శాల‌లు, ఇత‌ర కార్యాల‌యాల‌లో విధులు నిర్వ‌హించే సిబ్బంది, ఇత‌ర ఉద్యోగులు క‌లిసి ప్ర‌తిజ్ఞ చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప‌నిచేస్తామ‌ని, త్రిక‌ర‌ణ శుద్ధితో భ‌క్తుల‌కు సేవ చేస్తామ‌ని, టిటిడి ప్ర‌తిష్ట‌కు భంగం క‌ల‌గ‌కుండా న‌డుచుకుంటామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

త‌ద్వారా దేశ ఆర్థిక స్థితి గ‌తులు అభివృద్ధి ప‌రుచుట‌, రాజ‌కీయంగా ఉన్న‌త ప్ర‌మాణాలు, సామాజిక ప‌రంగా పురోభివృద్ధి సాధించేందుకు అవినీతి ప్ర‌తిబంధ‌కంగా ఉండ‌టం వ‌ల‌న దానిని నిర్ములించే ఉద్దేశంతో తాము కట్టుబడి ఉంటామని వారు ప్రతిన బూనారు. టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేర‌కు చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌, శ్రీ నారాయ‌ణ‌, శ్రీ ప‌వ‌న్‌కుమార్‌, శ్రీ సురేంద్ర, ఇత‌ర అధికారులు, ఉద్యోగులు, ఇత‌ర నిఘా, భ‌ద్ర‌తా సిబ్బంది పాల్గొన్నారు.

Corruption free TTD- Pledge by Employees

Tirumala Tirupati Devasthnam Employees did pledge against the corruption in TTD. They promised to co-operate TTD Development and Economical growth in the institution.

On the occation of central vigilance commission act week celbrations, the Vigilance wing of TTD arganised a programme on fourth day in Tirumala on Friday morning. In this programme all staff of various departments in TTD were participated. They promissed to eradicate Corruption to Build a New India and they took Integrity Pledge. TTD Vigilance VGO Ashok Kumar goud, AVSO Nandheeswar, Pavan Kumar, Surendra and others were participated in this Programme Prabhakar is looking after events of Vigilance Week.    

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*