Online : 69,512 ఆర్జితసేవా టికెట్లు

తిరుమల : శ్రీవారి భక్తులు ఎదురు చూస్తున్న ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. అయితే ఈ ఆర్జితసేవలను చూసి తరించాలంటే కనీసం మూడు నెలలు వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటి నుంచే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెల కోటాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అయితే ఇప్పటి నుంచే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెల కోటాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2020, ఫిబ్ర‌వ‌రి నెల కోటాలో భాగంగా వివిధ సేవలకు సంబంధించి 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం టిటిడి విడుదల చేసింది.

ఆన్‌లైన్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,112 సేవా టికెట్లు ఉన్నాయి. డిప్ విధానంలో సుప్రభాతం 7,332, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లను భక్తులకు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 59,400 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జితబ్రహ్మోత్స‌వం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయి.

త్వరలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఫిబ్ర‌వ‌రి కోటా విడుదల

భక్తుల సౌకర్యార్థం 2020 ఫిబ్ర‌వ‌రి నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 5న టిటిడి అధికారులు విడుదల చేయ‌నున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన సాంకేతిక శాఖ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5 తరువాత ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.స్వామి వారి దర్శనానికి రావాలని ఆకాంక్షిస్తున్న వారు ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చునని టిటిడి తెలిపింది.

TTD released 69,512 Aarjitha Seva ticket quota of Feb 2020

Tirumala Tirupati Devasthnam released Aarjitha Seva ticket quota of Feb 2020 on Friday morning 10 AM. To have these tickets, devotees have to apply through online.

In this qouta, TTD officials are allotted 10,112 tickets to dip system. to get this ticket devotees have to apply through oline. TTD decided to issue 7,332 Suprabhatha tickets, 120 Archana, 120 Thomala 240 Astadalapadapadmaradhana, 2300 Nijapada dharshana tickets through dip system. Remaining 59,400 tickets will be issued in online general category.

2,000 Visesha pooja, 13,300 Kalyanam, 4200 Unjalaseva, 7,700 Arjithostavam, 15,400 Vasanthotsavam, 16,800 Sahasra tickets are alloted to this quota. . To grab these tickets, devotees are requested to apply through online.
Rs.300/- Special dharshan quota tickets released on Nov 5

Tirumala Tirupati Devasthnam will be released Rs. 300/- Special dharshan quota ticket of Feb 2020 on 2019, Nov 5th. TTD IT wing is gearing up to releas the quota. Devotees have to apply through online for these tickets.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*